Why Literature?


whyLiterature

Next weekend…..

Who is the notorious criminal?

Here i am sharing a letter written by a notorious criminal from Andhrapradesh, India. (after reading his 2 pages letter i dont feel to call him as criminal). He wrote a letter to the author (Gollapudi MarutiRao garu) when he was in Charlapalli central Jail.

Guess who wrote the letter?

Downlode it and Listen from Here

 

 

 

 

 

 

Advertisements

ఆ-‘రుద్ర ‘


ఆ-‘రుద్ర ‘

వారాంతం, సమయం ఉదయం 3.30 అవుతోంది. పక్కింట్లో నుంచీ అరుపులు. పక్కింట్లో ఒక టర్కీ కుటుంబం ఉంటుంది. వాడి భార్య అనుకుంటా జర్మన్ భాషలో వాడిని దులిపేస్తోంది.
నా జర్మన్ భాషా పరిజ్ణానాన్ని పెంచుకుందామని (మాత్రమే) ఒక చెవు అటువేసి, ఇటు యుట్యూబులో అలా శోధించటం మొదలుపెట్టా. అనుకోకుండా ఆరుద్ర గారి భార్య రామలక్ష్మి గారి ఇంటర్వూ

ఈ వయసులో కూడా ఇంత “గట్టిగా” మాట్లాడుతుందంటే……. ఆరుద్ర మీసాలు ట్రిం చేసి గడ్డం మాత్రమే ఎందుకు పెంచేవాడో అన్న నా ధర్మ సందేహానికి సమాధానం దొరికినట్లయ్యింది.

చాలా ఓపెన్ గా మాట్లాడారు, చాలా వ్యంగ్యాస్త్రాలు, మాటల తూటాలు—– ఆమె మాట్లాడిన వాటిల్లో కొన్ని….

  • “నాలాంటి గయ్యాళిది ఆరుద్రకి భార్యగా వస్తుందని” ఎవరన్నా అనుకున్నారా?
  • ఎన్.టి.ఆర్ ఆరుద్రతో అనేవారు “ఈవిడిని ఎలా భరిస్తున్నావయ్యా?” అని.
  • “I am a dare devil. He(Arudra) is lucky enough that he ended his life in my hands”
  • శ్రీశ్రీ ది ఒక కవిత్వమా, పిచ్చెక్కినప్పుడు కవిత్వం రాస్తాడు. “పదండి ముందుకు, పదండి తోసుకు పోదాం పోదాం….” అన్నది ఇంగ్లోషులో .The Birdఅన్న పోయంకి అనువాదం.
  • విశ్వనాథ సత్యన్నారాయణది బ్రాహ్మణ భక్తి. స్టేజీ మీదే 1116 లెక్కపెట్టుకునే వాడు.
  • కవిత్వాన్ని పట్టుకుని కాపురాలు చెడగొట్టుకున్న వాళ్ళ చరిత్రని “వెలసి పోయిన దాంపత్యాలు” అని పుస్తకం రాశా.
  • కరుణానిధి ఒక గొప్ప స్కాలర్.
  • విశ్వనాథ్ ఆనంద్ చిన్నప్పుడు ఆరుద్ర దగ్గర చెస్ నేర్చుకున్నాడు.

సమగ్ర ఆంధ్ర సాహిత్యం:

“ఆరుద్ర గాడిదలా కష్టపడి రాసింది సమగ్ర ఆంధ్ర సాహిత్య చరిత్ర, ఎమెస్కో ఎం. శేషాచలం చనిపోయాక వాటిని పట్టించుకున్న వాడే లేడు. చంద్రబాబు చేత మొండిగా వాదించి ప్రభుత్వమే మళ్ళీ ముద్రించేలా చేశా”. (రామలక్ష్మి)

తెలుగు సాహిత్య చరిత్ర ఎంతమంది రాసినా ఒక చారిత్రక ద్రుష్టితో మొదటిసారిగా యుగ విభజన చేసి సాహిత్యాన్ని చారిత్రక కోణంలో చూపించిన ఏకైక ప్రచురణ సమగ్ర ఆంధ్ర సాహిత్యం.

IMG_20180131_193233

పోయిన సంవత్సరం ఇండియా వెళ్ళినప్పుడు ఎయిర్ లైన్స్ వాడు ఇచ్చే 30 కిలోల్లో చివరికి సెనగ పప్పా? సాహిత్య చరిత్రా? ఏది తెచ్చుకోవాలి? అన్న విషయంపై ఆమెతో వాదోపవాదాలమీదట….

ఆరుద్ర 12 సంపుటాలుగా దీన్ని ప్రచురిస్తే ప్రస్తుతం దాన్ని 4 సంపుటాలుగా మార్చి (కుదించి) తెలుగు అకాడమీ తిరిగి ముద్రించింది. 1వ సంపుటం అందుబాటులోనే లేదు. 2003 లో హెచ్.సి.యులో 12 సంపుటాలనీ చదివాను. 12 సంపుటాలని 4 సంపుటాలుగా కుదించటంలో చాలా విలువైన సమాచారాన్ని వదిలేశారు.

ఈ పుస్తకం కవర్ పేజీలో పైన మూడు అక్షరాల (అర్ధంకాని లిపిలో) ఒక పదం ఉంటుంది. అదే మనకు చారిత్రకంగా లభిస్తున్న మొట్ట మొదటి తెలుగు పదం “నాగబు” చిత్రం.

samagra_andhra_asahityam002_1024x1024

 

 

ఆశా “కిరణం”


ఒక తెలుగు మా´స్టారు´

Kiran Anna 20171222_080506

గవర్నమెంట్ జాబులంటే తిని కూర్చునేవి అని ప్రగాఢంగా నమ్మే ఈరోజుల్లో, గవర్నమెంట్ కాలేజీలకి వెళ్తే పిల్లలు తప్పుతోవ పడతారు అని ఫ్రైవేటు విద్య వైపు మగ్గు చూపుతున్న ఈరోజుల్లో 3 సంవత్సరాల డిగ్రీ పూర్తయ్యేలోపు క్లాసులో 60% విద్యార్ధులు వివిధ రంగాల్లో ఉపాధి అవకాశాలను తెచ్చుకోటానికి తనవంతు క్రృషిచేస్తూ మా రేపల్లే ఎబిఆర్ డిగ్రీ కళాశాలను యుజిసి నాక్ కమిటీ ముందు తలమానికంగా నిలిపిన మా అన్న తెలుగు ఉపన్యాసకులు టి. కిరణ్ కుమార్ గురించి నాలుగు మాటలు.

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (2000) తెలుగు శాఖ గోల్ద్ మెడలిస్ట్. పరిశోధనలో మాకందరికీ మార్గదర్శకులు. ఏ సబ్జెక్ట్ ఇచ్చినా అనర్గళంగా ముఖ్యంగా హుందాగా మాట్లాడగలరు. ఒక పరిశోధకుడి గది ఎలా ఉండాలో నేను అన్న నుంచే నేర్చుకున్నాను. యూనివర్శిటీలో మాకు ఏ సలహా కావల్సివచ్చినా మేం కలిసే వ్యక్తుల్లో మొదట ఉండేది కిరణన్నే.

కుడిఎడంగా 9 సంవత్సరాల తరువాత మళ్లీ మా రేపల్లె డిగ్రీ కాలేజీలో కలిశాం. అన్న రేపల్లెలో పనిచేస్తున్నాడు అన్నప్పుడు నా మనసులో మెదిలిన మొదటి విషయం తప్పకుండా ఎదో కొత్తగా చేస్తాడు అని. మేం కలిశాక అన్న అన్న మొదటి మాట “హెచ్ సి యు మనకి చాలా ఇచ్చింది, చాలా నేర్పింది తమ్ముడూ, ప్రవేటు కాలేజీ వాళ్ళకన్నా పదింతలు జీతాలు తీసుకుంటున్నాం, ఇక్కడికి వచ్చేది చాలా మంది పేద విద్యార్ధులు వాళ్ళకి ఒక భరోసా ఇవ్వాలి”.

రోజుకి 2 గంటలు పాఠాలు చెప్పి ఖాళీగా కూర్చోకుండా ఆశక్తి ఉన్న విద్యార్ధులకు సివిల్స్, గ్రూప్ పరీక్షలకు శిక్షణ ఇస్తున్నారు. ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలున్న ఉన్న సైనిక రంగంలో విద్యార్ధులకు పాధమిక శిక్షణ ఇవ్వటానికి మూడు నెలలు కుటుంబానికి దూరంగా తాను శిక్షణ తీసుకుని, వాళ్లకి శిక్షణ ఇస్తున్నారు. ఇదే కాకుండా రేపల్లెలో ఉన్న వివిధ కులవృత్తి మాండలికాల మీద విద్యార్ధుల చేత చిన్న చిన్న ప్రాజెక్టులు చేయిస్తున్నారు.ప్రాథమిక పాఠశాలనుండీ కళాశాల వరకూ ప్రతి విద్యార్ధికీ మాతృభాష ఉపాధ్యాయుడితో చాలా దగ్గర తనం ఉంటుంది, ఆ దగ్గరతనం తో వాళ్లకి సరైన దిశానిర్దేశం చేయటం అభినందనీయం.

సైనిక రంగంలో విద్యార్ధులకు పాధమిక శిక్షణ (click here)

 

 

 

 

 

 

Open Source Library


IndologyDear All, Here i am sharing my collections of Indology related books (approx 1500 books). These are open source books. Please share to other Indology scholars and Indology Libraries. If you are not able to down-lode please let me know through your comments.

Link1

Link2

Link3

Note: A little donation or work for any social welfare organization which ever you like will be appreciable.

1950´s Chandamama Books


Chandamama is a classic Indian monthly magazine for children, famous for its illustrations. It also published long-running mythological/magical stories that ran for years. Originally, Chandamama” was started in Telugu by B.Nagi Reddy and Chakrapani, noted Telugu Film Producer’s. It was edited by Kodavatiganti Kutumba Rao,a literary colossus in Telugu Literature, who edited it for 28 years, till his death in August 1980. Chandamama was first published in Telugu and Tamil (as Ambulimama) in July 1947. It is available in 12 Indian languages and English.(Wiki)

Telugu Chandamama First Edition

Cover Page of First Telugu Chandamama (1947-Dec)

Here you can downlode 1950’s Telugu Chandamama books. Thank you K. Subrahmanyam Garu for providing these books.

Singupalem : Theater arts


Manne Srinivasa rao Garu asked me to write  a review on his book “Repalle Rangasthali“.  Initially i thought it is a normal book which requires normal review. I started reading that book and gave a break to review. Believe me, it has amazing historical data which you can realize about your village greatness. He has provided really valuable and precious data about many villages. One word want to say i have seen “The thirst of research”  in his book. Why said this is “There is no scope to copy such data (you cant find in any other books) until unless you have to do field work.”

I would like to mention a few points about my small village “Singupalem” which i have seen in his book.

1. The first stage play at Singupalem was on 23-12-1928 (on mukkoti eekaadasi), stage play name: “Delta Raitu”  (we are modern people, the first play is Social Drama not Mythological ones. “Dalta Raitu” might be first Social drama in Repalle Taluka). It was written and directed by Yarlagadda Raghavayya who belongs to Singupalem. He established “Sri Siitaraama  Baalabhaarati naataka samaajam” in 1928. Sajja Venkayya, Yarlagadda Krishnayya, Kolli Venkatramayya, Kolli Venkateswara Rao(Munasub) are established members for this association.

2. In the history of Telugu Drama, The first Framer based Social Drama “Delta Raitu” born at Singupalem.

3. The first played mythological drama at Singupalem was: “Narakasura Vadha” on mukkooti eekadasi, 1930.

Yarlagadda Raghavayya   as   Narakasura

Kolli Venkateswara Rao   as  Krishna

Yarlagadda Krishnayya    as   Narada

Kolli Venkatramayya     as   Satyabhama

Here is the photo of those great people:

Singupalem

In his book he has given drama art history of 64 villages located in Repalle Taluka. A worth full book to read. I came to know some interesting facts about my small village.

Author’s mail ID: mannesri68@gmail.com

ముక్కంటికి మూడు ప్రశ్నలు:


స్వామీ!! గోడమీద ఉన్న నీ ఫ్యామిలీ ఫొటోని చూస్తూ ఉండగా…..
1. నీ మెడలో ఉండేది పాము, నీ కొడుకు వాహనమా దానికి బధ విరోధి ఐన ఎలుక, ఇంకో కొడుకు వాహనమా నీ మెడలో ఉన్న పాముకి విరోధి ఐన నెమలి, చివరికి నీలో అర్ధభాగామైన నీ అర్ధాంగి వాహనం సింహం, దానికి నీ వాహనం నందికి జాతివిరోధం. ఇన్ని జాతి వైరుధ్యం ఉన్న జంతువుల మధ్య ఎలా ప్రశాంతంగా (ఫ్యామిలీ ఫొటో దిగావయ్యా?) ఉంటున్నావయ్యా? మనుషులుగా ఉండి మేము కులం మతం ప్రాంతం అని కొట్టుకు చస్తున్నాం. వాటి మధ్యే నీకు ప్రశాంతత, మా మధ్యకు రాకు. ఎందుకంటే అవి జంతువులు మేం మనుషులం.
2. నువ్వు కట్టుకునేదా ఏనుగు చర్మం. పుసుకునేదా విభూతి, ఉండేదా మంచు కొండ. నీ గుడి ముందు ఆకలితో అల్లాడే వాడికి పట్టెడు అన్నం పెట్టని ఈ మనుషులు నీకు పాలాభిషేకాలు చేయటానికి, నైవేద్యాలు పెట్టటానికి పట్టు పీతాంబరాలతో  బారులు తీరారు.  పుక్కిట ఎంగిలి  నీళ్ళతో నీకు స్నానం చేయించి మాంసాన్నే నైవేద్యం గా పెట్టి తింటావా? తినవా? అని కూర్చున్న బోయ తిన్నడికి కనిపించావు కానీ, నిత్యం నిన్నే మంత్రాలతో పూజించిన పూజారికి కాదుకదా? “చిత్త సుద్ధి లేని శివపూజలేలయా”?
3. నువ్వు ఇలా అడిగితె అలా వరాలు ఇచ్చేస్తావ్ అంట. మా రాజకీయ నాయకులు కూడా నిన్నే ఆదర్శంగా తీసుకుని ఆల్ ఫ్రీ ఆపర్స్ ఇచ్చేస్తున్నారు. నువ్వు నీ 3 కళ్ళ ముందు చూపుతో పర్మినెంటుగా శక్తికి నీలో సగభాగం ఇచ్చి బుధి గల వినాయకుడిని పక్కనే పెత్తుకున్నావ్. మా రాజకీయ నాయకులకు నీ “అర్ధనారీశ్వర తత్వాన్ని” అనుగ్రహించ గలవా? ఆకాశం లో సగం అని అని మేము చెప్పుకునే ఆడవాళ్ళు అవకాశాల్లో సగం (50%) ఇంకా అందుకోలేదు.

siva

Probably the earliest known representation of Shiva: Gold Dinar, c. 200-225 CE Weight: 8.02 gm., Diam: 21 mm