Archive for January, 2021

రైతు – సంక్రాంతి


ఈ రోజు మాన్యులు గౌ: భారత ఉపరాష్టపతి గారినుండీ సంక్రాంతి శుభాకాంక్షల సందేశం అందింది. నన్ను గుర్తుంచుకుని శుభాకాంక్షలను పంపినందుకు వారికి ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు.

ఈ దేశంలో ఆరుగాలం కష్టపడే రైతు జీవితంలో నిజంగా సంక్రాంతి ఉందా? కష్టపడేది ఒకడు దాన్ని దళారీ మార్గంలో దోచుకునేది ఒకడు. ఒళ్ళు వంచి పనిచేసేది ఒకడు, వంచించి విలాసవంతంగా బతికేది ఒకడు. నా వ్యక్తిగతంగా చెప్పలంటే కొత్తగా భారత ప్రభుత్వం చేసిన రైతు చట్టాలను మనస్పూర్తిగా నేను సమర్ధిస్తాను. ఓక వేళ వాటిలో లోటుపాటులుంటే సాంకేతికత ద్వారా రైతుకి వినియోగదారుడికి మధ్య డైరెక్ట్ వినిమయాన్ని సృష్టించి రైతుకి లాభం చేకూర్చ వచ్చు. కుత్రిమ భౌద్ధికత ద్వారా ఒక పంటకు భవిష్యత్తులో రేటు ఎలా ఉండబోతోందో ముందే చెప్పొచ్చు. దీనికి ఆయా కాలంలో ప్రతి రైతు తను వేసిన పంట, వేయబోతున్న పంట సమాచారాన్ని డేటా బ్యాంకులో నిక్షిప్తం చేయాలి. ఇలాంటి పని ప్రభుత్వాలు స్థానికి గ్రామ వాలంటీర్లతో చేయించి సమగ్ర డేటాబ్యాంకులను నిర్మించాల్సి ఉంటుంది. దీనిలో భాగంగా నేను మా విద్యార్ధులతో రైతే తన ఉత్పత్తులను అమ్ముకునే విధంగా ఈ యాప్ను నిర్మిస్తున్నాం.

తర్వాత మేం డవలప్ చేయబోయే యాప్ అవినీతి నిర్మూలన కి. జర్మనీలో స్థానిక పోలీసులు వాడుతున్న ఈ యాప్ చాలా అద్బుతంగా ఉంది. ఈ యాప్ డవలప్ చేయటానికి మాకు ప్రజల సహకారం కావాలి. మీ జీవితంలో ఎప్పుడన్నా మీరు లంచం ఇవాల్సి వచ్చిందా ? ఎటువంటి సందర్బంలో ఇవాల్సి వచ్చింది? మొదలైన సమాచారం. దీనిమీద మేము ఒక వెబినార్ నిర్వహించ దలచాము. లంచాలు అడిగేవాళ్లని ఎలా పట్టుకోవాలో ఐఏఎస్, ఐపిఎస్ అవినీతి నిరోధక శాఖ అదికారులతో మీకు చెప్పిస్తాము. దయచేసి ఈ కింది లింకులో ఈ వెబినారుకోసం నమోదు చేసుకోగలరు.

https://forms.gle/ss5YFZXo4gL8XV4dA

కలియుగ ఏసు?!!


దేవుడా రక్షించు నాదేశాన్ని పతివ్రతలనుండీ (పవిత్రాత్మల), పోలీసులనుండీ!!

ఆ ఏసు ఎన్ని గంటలు శిలువమోశాడో తెలీదుగానీ !! 28 సంవత్సరాలు అతిగొప్పదైన మన న్యాయవ్యవస్థ, అతి నిజాయితీగా పనిచేసే మన పోలీసు వ్యవస్థను మోసిన, భరించిన ఈ దొంగ నా దృష్టిలో నిజమైన ఏసు.

మీకు ఏమాత్రం స్పందించే హృదయం ఉన్నా ఈ వార్తని పూర్తిగా ఒక్కసారి చదివి ఈ వ్యవస్థల గురించి ఒక్క కామెంట్ చేయండి.

https://www.eenadu.net/sundaymagazine/article/321000033

మేరా భారత్ మహాన్!!

Happy New Year



क्षणम् प्रति क्षणम् यन्नवं नवम् l
तत् च सुन्दरम् सत् च तत् शिवम् ll
वर्ष नूतनम् ते शुभम् मुदम् l
उत्तरोत्तरम् भवतु सिद्धिदम् ll


క్షణం ప్రతి క్షణం యన్నవం నవమ్ l
తత్ చ సుందరమ్ సత్ చ తత్ శివమ్ ll
వర్ష నూతనం తే శుభమ్ ముదమ్ l
ఉత్తరోత్తరం భవతు సిద్ధిదమ్ ll


Each & every moment that is fresh and new!
May it be beautiful, real and auspicious!!
This new year, may it be the best ever!
May it bring you more success!! (Transliterated by Swarnamdhra Eng Clg Faculty member)