రైతు – సంక్రాంతి

ఈ రోజు మాన్యులు గౌ: భారత ఉపరాష్టపతి గారినుండీ సంక్రాంతి శుభాకాంక్షల సందేశం అందింది. నన్ను గుర్తుంచుకుని శుభాకాంక్షలను పంపినందుకు వారికి ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు.

ఈ దేశంలో ఆరుగాలం కష్టపడే రైతు జీవితంలో నిజంగా సంక్రాంతి ఉందా? కష్టపడేది ఒకడు దాన్ని దళారీ మార్గంలో దోచుకునేది ఒకడు. ఒళ్ళు వంచి పనిచేసేది ఒకడు, వంచించి విలాసవంతంగా బతికేది ఒకడు. నా వ్యక్తిగతంగా చెప్పలంటే కొత్తగా భారత ప్రభుత్వం చేసిన రైతు చట్టాలను మనస్పూర్తిగా నేను సమర్ధిస్తాను. ఓక వేళ వాటిలో లోటుపాటులుంటే సాంకేతికత ద్వారా రైతుకి వినియోగదారుడికి మధ్య డైరెక్ట్ వినిమయాన్ని సృష్టించి రైతుకి లాభం చేకూర్చ వచ్చు. కుత్రిమ భౌద్ధికత ద్వారా ఒక పంటకు భవిష్యత్తులో రేటు ఎలా ఉండబోతోందో ముందే చెప్పొచ్చు. దీనికి ఆయా కాలంలో ప్రతి రైతు తను వేసిన పంట, వేయబోతున్న పంట సమాచారాన్ని డేటా బ్యాంకులో నిక్షిప్తం చేయాలి. ఇలాంటి పని ప్రభుత్వాలు స్థానికి గ్రామ వాలంటీర్లతో చేయించి సమగ్ర డేటాబ్యాంకులను నిర్మించాల్సి ఉంటుంది. దీనిలో భాగంగా నేను మా విద్యార్ధులతో రైతే తన ఉత్పత్తులను అమ్ముకునే విధంగా ఈ యాప్ను నిర్మిస్తున్నాం.

తర్వాత మేం డవలప్ చేయబోయే యాప్ అవినీతి నిర్మూలన కి. జర్మనీలో స్థానిక పోలీసులు వాడుతున్న ఈ యాప్ చాలా అద్బుతంగా ఉంది. ఈ యాప్ డవలప్ చేయటానికి మాకు ప్రజల సహకారం కావాలి. మీ జీవితంలో ఎప్పుడన్నా మీరు లంచం ఇవాల్సి వచ్చిందా ? ఎటువంటి సందర్బంలో ఇవాల్సి వచ్చింది? మొదలైన సమాచారం. దీనిమీద మేము ఒక వెబినార్ నిర్వహించ దలచాము. లంచాలు అడిగేవాళ్లని ఎలా పట్టుకోవాలో ఐఏఎస్, ఐపిఎస్ అవినీతి నిరోధక శాఖ అదికారులతో మీకు చెప్పిస్తాము. దయచేసి ఈ కింది లింకులో ఈ వెబినారుకోసం నమోదు చేసుకోగలరు.

https://forms.gle/ss5YFZXo4gL8XV4dA

Leave a comment